ఈటీవీలో వచ్చే జబర్దస్త్ షోకి ప్రజల నుండి చాల ఆదరణ పొందింది. దాదాపు ఏడేళ్లుగా నిర్విరామంగా ప్రేక్షకులను కడుపుబ్బా నవ్విస్తున్న కామెడీ షో జబర్దస్త్. ఈ షోలో తెర వెనక టీం లీడర్స్ ఎంత కష్టపడిన తెర ముందుకు వచ్చే సరికి నవ్వులు పోయిస్తారు. ఇంతక ముందు ఈ షోకి నాగబాబు, రోజా న్యాయ నిర్ణేతలుగా ఉన్నారు. అనివార్య కారణాల వాళ్ళ నాగబాబు షోని విడిచి వెళ్లారు. ఈ షోకి ప్రస్తుతం మాను న్యాయనిర్ణేతగా వస్తున్నారు.
దాదాపు ఏడేళ్లుగా నిర్విరామంగా ప్రేక్షకులను కడుపుబ్బా నవ్విస్తున్న కామెడీ షో జబర్దస్త్. ఈ షో గురించి మాట్లాడుకోవాలంటే ముందుగా హైపర్ ఆది, యాంకర్ అనసూయ గురించి చెప్పాలి. ఆన్ స్క్రీన్ మీద సుడిగాలి సుధీర్, రష్మి గౌతమ్ పెయిర్‌కి ఎంత క్రేజ్ ఉందో అందరికి తెలుసు. ఇప్పుడు ఆది, అనసూయకు కూడా జనాల్లో అంతే క్రేజ్ ఉంది. అనసూయకు పెళ్లయినా ఆది ఆమె వెంటపడుతూనే ఉన్నాడు. తాజాగా జబర్దస్త్ లేటెస్ట్ ఎపిసోడ్ ప్రోమో విడుదలైంది. మూడు పంచ్‌లు ఆరు డైలాగులతో ప్రోమో అదిరిపోయింది.
ఎప్పుడూ అనసూయతో కలిసి డ్యాన్సులు చేయాలని ఆత్రుతగా ఫీలయ్యే హైపర్ ఆది ఈసారి రూటు మార్చాడు. తన స్కిట్‌కు గెస్ట్‌గా ప్రముఖ నటి, రాజకీయవేత్త మాధవీ లతను తీసుకొచ్చాడు. ఆమెతో కలిసి ‘పెదవి దాటని మాటొకటుంది తెలుసుకో సరిగా’ అనే పాటకు రొమాంటిక్ డ్యాన్స్ వేశాడు. ఇది చూసిన అనసూయకు అసూయ కలిగింది. ‘పట్టుకుంది చాల్లే ఇక వదిలెయ్’ అనగానే.. ఎదురుగా ఉన్న రోజా ‘ఆది ఎక్కడో కాలుతున్న వాసన వస్తోంది’ అని పంచ్ వేశారు.
ఇమ్మాన్యుయేల్ మల్లెపూలు అమ్ముకుంటూ వస్తాడు. అతన్ని చూసి వెంకీ ‘ఏ మల్లెపూలు ఇట్రా’ అని పిలవడం.. ఇందుకు ఇమ్మాన్యుయేల్ ‘మల్లెపూలు వెళ్లమ్మా అతను పిలుస్తున్నాడు’ అని పంచ్ వేయడంతోనే నవ్వులు పండాయి. మధ్యలో జడ్జ్ మనోగారు కూడా నాలుగు పంచ్‌లు వేసి రెచ్చిపోయారు.